కొడుకు సిక్.. హాస్పిటల్‌కు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే
AP: కొడుకు సిక్.. హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. కానీ దారిలో సీతపల్లి వాగు ఫుల్ ఫ్లోతో ఉద్ధృతంగా ఉంది. అయినా తండ్రి వెనక్కి తగ్గలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా.. దేవీపట్నం మండలం.. వెలగపల్లి దగ్గర్లో ఈ ఘటన జరిగింది. తాడును పట్టుకుని అనారోగ్యంతో ఉన్న కొడుకును మోస్తూ తండ్రి వాగును దాటాడు. ప్రభుత్వాలు మారుతున్నా గిరిజన ప్రాంతాల్లో బేసిక్ హెల్త్‌కేర్, రోడ్డు సదుపాయాల సమస్యలు మాత్రం తీరడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


