అందుకే ఆయన సూపర్‌స్టార్

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ‘జైలర్ 2’లో నటించడం మంచి అనుభవమని నటి విద్యాబాలన్ చెప్పారు. ఆయన షూటింగ్ సెట్‌కు వస్తే ఎంతో హడావుడి ఉంటుందని అనుకున్నానని, కానీ ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణంగా వచ్చారని తెలిపారు. అందరితో నవ్వుతూ మాట్లాడటం, ప్రతి ఒక్కరినీ గౌరవించడం ఆయన ప్రత్యేకత అని ప్రశంసించారు. ఆయనలాంటి స్టార్ కూడా అందరితో కలిసిపోవడం తనను ఆకట్టుకుందని విద్యాబాలన్ అన్నారు. కాగా, రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది.



