రైతులు లేని టైంలో స్టే భూముల్లో రీ-సర్వే

ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 10.14 ఎకరాల అసైన్డ్ భూమిలో దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతులకు 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ భూమికి పట్టాలు ఇవ్వగా, ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఈ స్టే ఉన్న భూమిలోకి ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే శాపంగా మారింది. ఎలాంటి నోటీసులు లేకుండా, రైతులు లేని సమయంలో అధికారులు సర్వేకు రావడంతో రైతులు నిలదీశారు. అయితే, తమ పనికి అడ్డుపడితే కేసులు పెడతామంటూ అధికారులు భయపెట్టారు.





