దసరాకు రెండు స్పెషల్ ట్రైన్స్

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) సికింద్రాబాద్–కాకినాడ మధ్య 2 స్పెషల్ ట్రైన్లు నడపనుంది. 07817 ట్రైన్ అక్టోబర్ 9న సికింద్రాబాద్ నుంచి రాత్రి 7:25 గంటలకు, 07818 ట్రైన్ ఈనెల 10న రాత్రి 9 గంటలకు కాకినాడ నుంచి తిరుగు ప్రయాణం. బయల్దేరుతాయని CPRO శ్రీధర్ తెలిపారు. ఈ ట్రైన్లు చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోటలో ఆగుతాయి. దసరాకు ఊరెళ్లే వాళ్లు జర్నీ ప్లాన్ చేసుకోండి.



