అనకాపల్లిలో ఆ యువకుడు సేఫ్

అనకాపల్లి జిల్లాలో హ్యాపీ ఎండింగ్. ఝార్ఖండ్ నుంచి పని కోసం వచ్చిన భీమ్ కుమార్ మహతో (32) కనిపించకుండా పోయాడు. సెప్టెంబర్ 4న స్నేహితుడితో కలిసి అనకాపల్లి వచ్చాడు. పరవాడలో ప్రైవేటు పరిశ్రమలో పనికి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. తలకు గాయమై తిరుగుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కైలాస్ నగర్, లక్ష్మీదేవి పేట ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీ చెక్ చేశారు. పోలీసులు అతన్ని గుర్తించి చికిత్స అందించి కుటుంబానికి అప్పగించారు. సీఐ ప్రేమ్ కుమార్ వివరాలు తెలిపారు.



