ఘోర ప్రమాదం.. 21 మంది మృతి!

సౌతాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెస్టర్న్‌కేప్ ప్రావిన్స్‌లో రెండు మినీ బస్సులు ఢీకొట్టుకున్నాయి. అప్పుడే బస్సులపైకి ఓ SUV దూసుకెళ్లడంతో ప్రమాదం మరింత తీవ్రమైంది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. ఈ విషాద ఘటన స్థానికులను షాక్ అయ్యేలా చేసింది.



