మణిపూర్‌లో మళ్లీ హైటెన్షన్!

మణిపూర్‌లో అక్టోబర్ 10న నాగ సంఘానికి చెందిన అలాపౌ రింగ్‌కంగ్‌మై అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. హత్య తర్వాత ఆయన తలను వేరు చేసి తీసుకెళ్లినట్లు నాగ సంఘాలు ఆరోపణలు చేశారు. తల దొరికే వరకు పోస్టుమార్టం చేయనివ్వమని ప్రభుత్వానికి 48 గంటల గడువు విధించాయి. భద్రతా బలగాలు ఐదు రోజుల తర్వాత నిన్న కాంగ్‌పోక్‌పి జిల్లా దగ్గరి అడవిలో తలను కనుగొన్నారు. దీంతో మెయితీ, కుకీ, నాగ వర్గాల మధ్య హింసతో మణిపూర్‌లో పరిస్థితులు ఇంకోసారి ఆందోళనకరంగానే మారాయి. హింసను అదుపు చేసేందుకు కేంద్రం అదనపు బలగాలను పంపిస్తోంది.


