అంబేద్కర్ వర్శిటీలో అడ్మిషన్లు.. లాస్ట్ డేట్ ఇదే

డాక్టర్ BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి UG, PG కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. BA, B.Com, B.Sc, M.A, M.Com, MBA వంటి కోర్సుల్లో చేరొచ్చు. అడ్మిషన్ కోసం సెప్టెంబర్ 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ అయిన M.A Telugu, MBA, M.Com, B.Com రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయని యూనివర్శిటీ పోర్టల్‌లో తెలిపింది. పూర్తి వివరాలు అధికారిక <a href="https://www.braouonline.in/Home.aspx">BRAOU </a>వెబ్‌సైట్‌లో చూడొచ్చు.



