సమస్య చూపిస్తే జైల్లో పెడతారా?

UPలోని ఫరూఖాబాద్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ దారుణమైన కండిషన్‌లో ఉంటే.. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన CJP మెంబర్ గౌరవ్ భారతీపై పోలీస్ FIR ఫైల్ చేశారు. ఈ అరెస్ట్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే విధిస్తూ ఊరటనిచ్చింది. స్కూల్స్ బాగు చేయాల్సింది పోయి, సమస్యను చూపించినందుకు అరెస్ట్ చేస్తారా అంటూ జస్టిస్ సలీల్ కుమార్ రాయ్, జస్టిస్ పదం నారాయణ్ మిశ్రాల బెంచ్ స్పందించింది. అలాగే ఈ ఇష్యూపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్‌కు నోటీసులు ఇచ్చింది.



