← Back to news

అచ్చంపేటలో ఉప ముఖ్యమంత్రి పర్యటన

By శ్రీనివాస్ నాగర్ కర్నూల్· 10h ago· Kalwakurthy (Ct), Kalwakurthy, Nagarkurnool
అచ్చంపేటలో ఉప ముఖ్యమంత్రి పర్యటన

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇవాళ పర్యటించనున్నారు. మన్ననూర్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేసి, సభలో పాల్గొంటారు. అనంతరం అమ్రాబాద్‌లో R&B రోడ్డు పనులకు, రాయలగండిలో లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ గోపురం పనులకు శంకుస్థాపన చేస్తారు. అచ్చంపేటలో కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసి ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో హాజీపూర్‌ నుంచి మన్ననూర్‌ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.

More in Local