చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్ల హల్‌చల్

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్‌లను అడ్డుకునే క్రమంలో ఘటన చోటుచేసుకుంది. రొంపిచెర్ల–పులిచెర్ల మార్గంలో స్మగ్లర్‌ల వాహనం ఫారెస్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు బీట్ అధికారులు, ఇద్దరు స్మగ్లర్‌లు గాయపడ్డారు. గాయపడిన స్మగ్లర్‌లను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా, ఫారెస్ట్ సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు స్మగ్లర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపడుతున్నారు.


