నేడు మహాచండీదేవిగా దుర్గమ్మ

AP: శరన్నవరాత్రులలో భాగంగా నాలుగో రోజు విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. సెలవుల కారణంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు, దర్శన క్యూలైన్ల దగ్గర రద్దీ పెరిగింది. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేలా దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


