← Back to news

DJ సౌండ్‌కు ఇల్లు షేక్

By Sharmila· 23h ago

TG: మెదక్ జిల్లా, రామాయంపేటలో వినాయక నిమజ్జనం సందర్భంగా భారీ DJ శబ్దం కలకలం రేపింది. శనివారం రాత్రి కొంతమంది భక్తులు పెద్ద ఎత్తున DJ పెట్టుకుని తెల్లవారుజాము వరకు డాన్సులు చేశారు. భారీ శబ్దం, కంపనాలకు దగ్గర్లోని ఓ ఇంటి పైకప్పు పెంకులు ఊడిపోయాయి. దీంతో ఆ ఇంట్లో వారు చాలా భయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

More in Viral