← Back to news

వైరల్‌గా తేజస్వి సూర్య భార్య శివశ్రీ స్కందప్రసాద్ పోస్ట్

By Vishi· 2d ago· X
వైరల్‌గా తేజస్వి సూర్య భార్య శివశ్రీ స్కందప్రసాద్ పోస్ట్

సంగీత విద్వాంసురాలు, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్య శివశ్రీ స్కందప్రసాద్ తన 'ఎక్స్' అకౌంట్‌లో పంచుకున్న అనుభవం వైరల్‌గా మారింది. ‘ఈ రోజు నేను బాధాకరమైన రైలు ప్రయాణం చేశాను. 40 మంది పెద్దల గుంపు యాభై ఆరు సీట్ల కోచ్‌ను ఆక్రమించి, ఐదు గంటలపాటు గట్టిగా మాట్లాడటాన్ని ఒకసారి ఊహించండి. ఆ గుంపులో లేని మిగతా పదహారు మందిమి వారిని ఊరికే భరించాల్సి వచ్చింది’ అని రాశారు. Public Space Behaviour గురించి ఈ పోస్ట్ చర్చకు తెచ్చింది.

More in Viral