← Back to news

ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు

By DK· 20 Jul 2026· సిద్దిపేట జిల్లా
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు

TG: రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా కాకుండా హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని, పదవులు ఎవరికి, ఎప్పటికి శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా అల్లీపూర్ నుంచి రంగనాయకసాగర్ వరకు రైతులు కాళేశ్వరం ప్రాజెక్టు నీటి కోసం నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. కాళేశ్వరం మోటర్లను వెంటనే నడిపించి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నది సహజ కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నీళ్లు విడుదల చేయకపోవడం వల్ల వచ్చిన కరువని ఫైరయ్యారు.

More in Politics