← Back to news

గద్వాల్ డిపోలో కార్మికుల ఓటింగ్

By ARJUN· 1h ago· Gadwal (R)(Part), Gadwal, Jogulamba Gadwal

గద్వాల్ పట్టణంలోని RTC బస్ డిపోలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. డిపోలో మొత్తం 371 ఓట్లు ఉండగా, ఎంప్లాయీస్ యూనియన్ (EU), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (TMU), తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ పోటీలో ఉన్నాయి. EU, TMU కూటమిగా బరిలో నిలిచాయి. ఉదయం నుంచే ఆర్టీసీ కార్మికులు డిపోలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటింగ్‌లో పాల్గొన్న అనంతరం కార్మికులు విధులకు హాజరవుతున్నారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.

More in Local