← Back to news

నర్సంపేట మెడికల్ కాలేజీలో వైద్యుల నిరసన

By srikanth thouti· 1h ago· Narsampet (Ct), Narsampet, Warangal
నర్సంపేట మెడికల్ కాలేజీలో వైద్యుల నిరసన

వరంగల్ జిల్లా నర్సంపేట మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న FMGE వైద్యులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళన చేపట్టారు. సమానంగా పని చేస్తున్న తమకు ఇతర ఇంటర్న్‌లతో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. “EQUAL WORK = EQUAL PAY”, “మా శ్రమకు స్టైఫండ్ మా హక్కు” అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. విదేశాల్లో MBBS పూర్తి చేసి, FMGE పరీక్షలో ఉత్తీర్ణులైన తమకు 12 గంటల డ్యూటీలతో పాటు ఎమర్జెన్సీ, రాత్రి విధులు కూడా కేటాయిస్తున్నారని తెలిపారు.

More in Local