తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

నర్సంపేటలో తూనికలు, కొలతల నిబంధనలు పాటించని వ్యాపారులపై లీగల్ మెట్రాలజీ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా అధికారి కె. మనోహర్ ఆధ్వర్యంలో చేపలు, చికెన్, మాంసం, పండ్ల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరికరాలకు సకాలంలో ధ్రువీకరణ లేకుండా, శాఖ ముద్రలు లేకుండా వినియోగిస్తున్న 15 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. వినియోగదారులకు సరైన తూకం అందించాలని అధికారి సూచించారు.


