← Back to news

మంటల్లో స్లీపర్ బస్సు.. 9 మంది దుర్మరణం

By Sharmila· 1d ago

UPలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి మహోబాకు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన ప్రయాణికులు గాయపడ్డారు. మరికొందరు కిటికీల నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మంటలకు కారణం ఏమిటన్నది అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

More in National