మైలవరంలో వైద్యం కోసం ఆర్థిక సాయం

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ₹28.5 కోట్ల CMRF వైద్య సహాయం అందించింది. తాజాగా ఇద్దరి చికిత్సలకు ₹4.60 లక్షల ఎల్.ఓ.సీలు మంజూరయ్యాయి. లక్ష్మీపురానికి చెందిన మనీష బిడ్డకు ₹2.56 లక్షలు, ఇబ్రహీంపట్నానికి చెందిన గుమ్మడి సైమన్కు ₹2.04 లక్షలు కేటాయించారు. MLA కృష్ణప్రసాద్ చొరవతో బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించింది. సీఎం చంద్రబాబుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.



