← Back to news

భైంసా డిగ్రీ కళాశాలలో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కార్యక్రమం

By Muthyam· 22 Aug 2026
భైంసా డిగ్రీ కళాశాలలో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కార్యక్రమం

భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించారు. భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కోసారి శ్రావణ్య అంతరిక్ష పరిశోధన, ISRO విజయాలపై PPT ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం వక్తృత్వ పోటీ నిర్వహించి, చంద్రయాన్, అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.

More in Local