← Back to news

దర్యాప్తు ముగించుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం

By Jaddu Udaykiran· 24 Aug 2026· Vizianagaram Bit 2, Vizianagaram Rural, Vizianagaram
దర్యాప్తు ముగించుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం

AP: విజయనగరం గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో విజయనగరం రూరల్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రమణ ప్రాణాలు కోల్పోయారు. కొండకరకాం కేసు దర్యాప్తు నిమిత్తం ఎస్‌ఐ అశోక్‌తో పాటు సిబ్బందితో కలిసి వెళ్లిన రమణ.. తిరిగి వస్తుండగా పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో రమణ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

దర్యాప్తు ముగించుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం

More in Local