నోయిడా బస్ అగ్ని ప్రమాదం.. ప్రేమికులను విడదీసింది

నోయిడాలో జరిగిన బస్ అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించారు. వారిలో శ్రుతి రావత్ ఒకరు. ఆమెను బస్సు ఎక్కించి, బస్ వెనకాలే 50 నిమిషాలు బైక్‌పై వెళ్లాడు మోహిత్ శర్మ. వాళ్లిద్దరూ ప్రేమికులు. నవంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ రోజు సాయంత్రం శ్రుతి ఓరైకి వెళ్తోంది. మోహిత్ కూడా వస్తానన్నా, శ్రుతి వద్దని చెప్పింది. అనంతరం జరిగిన ప్రమాదంలో శ్రుతి మరణించింది. “నేను వెళ్లి ఉంటే ఆమెను కాపాడేవాడినేమో” అని మోహిత్ భావోద్వేగంతో వివరిస్తున్నాడు.


