ACBకు ప్రభుత్వ అనుమతితో పనిలేదు: సుప్రీంకోర్టు

ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. లంచం తీసుకోవడం వంటి అవినీతి పనులపై ఎంక్వయిరీ చేయడానికి ACBకు ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో ACB కేసుల విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వ అనుమతులు రాక అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారిక విధుల్లో తీసుకున్న నిర్ణయాలపై ఎంక్వయిరీకి మాత్రమే ముందస్తు అనుమతి అవసరమని కోర్టు తెలిపింది.

