కల్తీ మందు తాగి 9 మంది మృతి

నాగాలాండ్‌లోని టుయెన్సాంగ్ జిల్లాలో కల్తీ మందు తాగి 9 మంది మృతి చెందారు. 11, 12వ తేదీలలో ఈ మరణాలు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మందు తాగిన తర్వాత చాలామందికి చూపు మసకబారడం, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, వికారం, వాంతులు రావడంతో ఆస్పత్రిలో చేరారు. వారిలో కొందరు మరణించారు. మందు తాగడమే వారి మరణాలకి కారణమని దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై టుయెన్సాంగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, మద్యం మూలం, దాని స్వభావాన్ని గుర్తించే పనిలో వున్నారు.


