30 ఏళ్లకే ఆర్మీకి గుడ్‌బై.. కారణమేంటంటే?

మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎయిడ్-D-కాంప్‌గా సేవలందించి, 30 ఏళ్ల వయసులోనే ఆర్మీకి ముందుగా రిజైన్ చేశారు. జమ్మూకాశ్మీర్ డోగ్రా రాజపుత్ర ఫ్యామిలీకి చెందిన ఆయన, 4-పారా స్పెషల్ ఫోర్సెస్‌లో బలిదాన్ బ్యాడ్జ్ సాధించి, 2021 రిపబ్లిక్ డేలో బెస్ట్ మార్చింగ్ కాంటింజెంట్ పొందారు. ADCగా రాష్ట్రపతి సెక్యూరిటీ, ప్రోటోకాల్ బాధ్యతలు చూశారు. మూడేళ్లు పర్శనల్ లైఫ్ లేకుండా, పెళ్లి చేసుకోలేక కుటుంబానికి దూరమైనందున, సొంత జీవితం కోసం రాజీనామా చేశారు. రాష్ట్రపతిని తల్లిగా భావించారు.



