గంజాయి తాగుతున్న 12 మంది అరెస్ట్

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బొడ్డపాడు సమీపంలోని జీడితోటలో గంజాయి తాగుతున్నారనే సమాచారంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో 12మందిని అదుపులోకి తీసుకుని గంజాయి, బైకులు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జేఆర్ పురం సీఐ ఎం.అవతారం, ఎస్సై వి.సందీప్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. పైడిభీమవరంలోని దాబాల ద్వారా గంజాయి సేకరించి, డ్రైవర్లు, స్థానిక యువతకు విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించామని పోలీసులు తెలిపారు.



