వినాయక నిమజ్జనానికి పోలీస్ రూల్స్ ఇవే!

మంగళగిరిలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని DSP సీహెచ్. మురళీకృష్ణ సూచించారు. గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతి విగ్రహానికి ముందే అనుమతి తప్పనిసరి అని, ఊరేగింపు టైమ్, రూట్, నిమజ్జనం ప్లేస్ పోలీసులకు చెప్పాలని అన్నారు. DJలు వాడకూడదని, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరారు. కరెంట్ వైర్లతో జాగ్రత్తగా ఉండాలని, రాత్రివరకు నిమజ్జనం సాగదీయకుండా ప్రాసెస్ త్వరగా ముగించాలని చెప్పారు.



