డంపు యార్డు వద్దని ఎమ్మెల్యేకు వినతి

షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం సిద్ధాపూర్‌లో డంపు యార్డు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని డంపు యార్డ్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు వినతి పత్రం అందజేశారు. డంపు యార్డు వస్తే 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతారని వెల్లడించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ విషయంపై నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాంబల్ నాయక్, పినపాక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



