నేరాల నియంత్రణలో మీడియా పాత్ర కీలకం: CI

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జర్నలిస్టులు పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని ఆర్మూర్ CI కొంగి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం అందించి వాటి నిర్మూలనకు తోడ్పడాలని సూచించారు. CP సాయి చైతన్య ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో Friendly Policing అమలు చేస్తూ శాంతిభద్రతలను కాపాడతామని తెలిపారు.



