అంతర్జాతీయ వేదికలపై నాగాలాండ్ సినిమా ‘ఆంగ్’

నాగాలాండ్‌కు చెందిన యువ దర్శకుడు థేజా రియో తీసిన ‘ఆంగ్’(Angh) సినిమా అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంటోంది. 2027 ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీ చేయడానికి అర్హత సాధించింది. నాగాలాండ్ నుంచి ఇలాంటి గుర్తింపు రావడం ఇదే మొదటిసారి. 1960లో నాగాలాండ్‌లో క్రైస్తవ మతవ్యాప్తి, దాన్ని కాదని తమ జీవనవిధానానికి కట్టుబడి ఉండటం ఇందులోని అంశం. కోన్యాక్ భాషలో తీసిన ఈ సినిమా దర్శకుడికి తొలి సినిమా కావడం విశేషం.



