సైబర్ దొంగల బ్యాంక్ అకౌంట్ల గేమ్! ఇద్దరు అరెస్ట్

కమీషన్ల కోసం బ్యాంక్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లకు ఇచ్చిన ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లు 60 నుంచి 70 బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డులు సేకరించి హర్యానాకు పంపినట్లు గుర్తించారు. ఈ అకౌంట్లకు దేశవ్యాప్తంగా 450 సైబర్ క్రైమ్ కేసులతో లింక్ ఉన్నట్లు, వీటి ద్వారా 60 నుంచి 70 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పాత ఒక్క రూపాయి నోటు పేరుతో 7.93 లక్షల రూపాయలు కొట్టేసిన కేసులో ఈ ముఠా గుట్టు బయటపడింది.



