← Back to news

విషాదంగా మారిన వినాయక చవితి అన్నదానం

By Sharmila· 14h ago· Ndtv

AP: విజయవాడ నగరం చిట్టినగర్‌లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానం విషాదంగా మారింది. ఈ నెల 20న వంట పనులు చేస్తున్న సుజాత అనే మహిళ ప్రమాదవశాత్తూ వేడి సాంబార్‌లో పడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు గవర్నమెంట్ హాస్పిటల్‌కి తెసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in AP