యువశక్తిలో మనమే ఫస్ట్.. కానీ తర్వాతేంటి?

భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలం 'డెమోగ్రాఫిక్ డివిడెండ్' (యువశక్తి). అయితే, ఈ అదృష్టం జీవితకాలం ఉండదు, మనకు కేవలం మరో 15 ఏళ్ల సమయం మాత్రమే మిగిలి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు! ప్రస్తుతం భారత్‌లో యువత, శ్రామిక శక్తి (Working-age population) ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థికంగా దూసుకుపోయే క్రేజీ అవకాశం ఉంది. కానీ, రాబోయే 15 ఏళ్లలో దేశ జనాభా నెమ్మదిగా ఓల్డేజ్ (Ageing) వైపు అడుగులు వేయడం స్టార్ట్ అవుతుంది. ఈ లోపే మన యువతకు సరైన నైపుణ్యాలు (Skills), నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించకపోతే.. చైనా తరహాలోనే మనం కూడా 'ధనవంతులం అవ్వకముందే ముసలివాళ్లం' అయిపోయే ప్రమాదం ఉంది.



