మట్టి వినాయకుడు.. పర్యావరణానికి కవచం! 🌱

అనంతపురం అర్బన్ నియోజకవర్గం కమలానగర్‌లో ఎన్విరాన్‌మెంట్ స్పెషల్ డ్రైవ్ జరిగింది. ప్రెస్ క్లబ్‌లో APWJF ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు, మొక్కలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ఎల్ నినో లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రతి మొక్కు మహా వృక్షంగా మారి పర్యావరణాన్ని కాపాడుతుందని చెప్పారు. జర్నలిస్టులు ప్రత్యేక చొరవ తీసుకుని మట్టి విగ్రహాలు, మొక్కలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.


