SIRపై హైకోర్టు ఫైర్

గోవా.. SIR ప్రక్రియలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఓటర్ల పేర్లు తొలగించడంపై ముంబై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అడ్రెస్ చేంజ్ కోసం Form-8 అప్లికేషన్ ఇచ్చినా, పేర్లు తొలగించడంపై ప్రశ్నించింది. ఓటర్ల లిస్ట్ నుంచి పేర్లు తొలగించేటప్పుడు సాఫ్ట్‌వేర్ చూపించినదే ఆధారం కాదనీ, చట్టం ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. పేరు తొలగించే ముందు సంబంధిత ఓటరుకు నోటీసు ఇచ్చి, వివరణకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది.
