ఆసుపత్రి గేటు వద్దే ప్రసవం..
ఉత్తరప్రదేశ్‌లోని భదోహీ జిల్లా జ్ఞాన్‌పూర్‌లో రాణి అనే గర్భిణి హాస్పెటల్ బయటే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి సిబ్బంది తమను చేర్చుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రాణికి హిమోగ్లోబిన్ స్థాయి 5 గ్రాములు మాత్రమే ఉండటంతో మీర్జాపూర్ మండల ఆసుపత్రికి, తర్వాత BHUకు రిఫర్ చేసినట్లు భదోహీ జిల్లా ముఖ్య వైద్యాధికారి డా. సంతోష్ చక్ తెలిపారు. ఈ ఘటనపై నలుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు.

