← Back to news

ముస్లింలు ఎవరి చేతిలోని వస్తువులు కారు: ఉమర్ అహ్మద్ ఇల్యాసి

By Vishi· 2h ago
ముస్లింలు ఎవరి చేతిలోని వస్తువులు కారు: ఉమర్ అహ్మద్ ఇల్యాసి

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసి సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశంలోని ముస్లింలు, మసీదుల ఇమామ్‌లకు విజ్ఞప్తి చేశారు. ముస్లింలు ఎవరి చేతిలోని వస్తువులు కారని, నిరసనలకు దూరంగా ఉంటూ, దేశంలో శాంతి వాతావరణాన్ని కాపాడాలని ఆయన ముస్లిం సమాజాన్ని కోరారు.

More in National