← Back to news

పశుసంవర్ధక శాఖలో ప్రమోషన్స్

By VEMANNA· 4d ago
పశుసంవర్ధక శాఖలో ప్రమోషన్స్

జోగులాంబ గద్వాల జిల్లాలో పనిచేసే ముగ్గురు ప్రమోషన్స్ పొందినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకట్ నారాయణ తెలిపారు. ధరూరు మండలం మార్లబీడు గ్రామానికి వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్‌గా రాఘవేంద్ర, గట్టు మండలం ఆలూరు గ్రామానికి జూనియర్ వెటర్నరీ ఆఫీసర్‌గా వెంకటేష్, మహబూబ్ నగర్ జిల్లా నన్చర్ల‌కు లైవ్ స్టాక్ అసిస్టెంట్‌గా భార్గవి ప్రమోషన్ పొందాలని వెంకటనారాయణ తెలిపారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.