← Back to news

విభేదాలు వద్దు.. కలిసిమెలిసి ఉందాం

By BK· 2d ago· చిత్తూరు
విభేదాలు వద్దు.. కలిసిమెలిసి ఉందాం

గ్రామాల్లో గొడవలు పడకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని జిల్లా ప్రధాన జడ్జి అరుణ సారిక చెప్పారు. శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌ను ఆమె ప్రారంభించారు. కోపంలో తొందరపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, సమస్యలు ఉంటే ఊళ్లోనే కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవాలని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 30 బెంచీల ద్వారా సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించారు. యాక్సిడెంట్ కేసులకు సంబంధించిన సర్టిఫికెట్లను బాధితులకు అందించారు.

More in Local