← Back to news

ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

By K. RAJASHEKAR KMR· 21 Aug 2026· Kamareddy
ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

TG : పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. మేకల వినయ్ (18) అనే కుర్రాడు ఈత కొడదామని చెరువులోకి వెళ్లి నీళ్లలో కొట్టుకుపోయాడు. సమాచారం తెలియగానే ఊరి జనం చెరువు దగ్గరికి వెళ్లి ఎంత వెతికినా వినయ్ ఆచూకీ దొరకలేదు. దాంతో వెంటనే రెస్క్యూ టీమ్‌కి తెలియజేయడంతో చెరువులో వెతుకుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More in Local