తిరుమలాయపాలెంకు కొత్త SI..

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్కు కొత్త SI వచ్చారు. పోగుల సురేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏడూళ్ల బయ్యారం PS నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.



