ఏజెన్సీలో వైద్య సేవలకు డ్రోన్లు

అల్లూరి సీతారామరాజు, ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలు.. డ్రోన్లతో సులభమవుతున్నాయి. గతంలో బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి గర్భిణులు, రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు స్థానిక PHCలో శాంపిల్ ఇస్తే చాలు.. డ్రోన్ దాన్ని పాడేరులోని హెల్త్ హబ్‌కు తీసుకెళ్తుంది. పరీక్షలు పూర్తయ్యాక రిపోర్టులను మళ్లీ డ్రోన్ ద్వారా PHCకి పంపుతున్నారు. దీంతో టైమ్, డబ్బు ఆదా అవుతున్నాయి. అత్యవసర మందులు, వ్యాక్సిన్లు కూడా డ్రోన్లతో పంపే అవకాశం ఉంది.



