భయపెట్టే పుర్రె.. ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్!

ఒకప్పుడు చావుకు, భయానికి గుర్తుగా చూసే 'పుర్రె' (Skull💀) సింబల్, ఇప్పుడు గ్లోబల్ ఫ్యాషన్ ప్రపంచంలో ఒక క్రేజీ ట్రెండ్‌గా మారిపోయింది. మొదట్లో బైకర్స్, రాక్ స్టార్ల నుంచి వచ్చిన ఈ స్టైల్, తర్వాత హార్లే డేవిడ్సన్ లోగోలు, అలెగ్జాండర్ మెక్‌క్వీన్ డిజైన్లతో లగ్జరీ ఫ్యాషన్ ఐకాన్‌గా ఎదిగింది. ఉంగరాలు, టీషర్టులు, డ్రెస్సుల నుంచి సోషల్ మీడియా ఎమోజీల వరకు ఈ పుర్రె గుర్తు కూల్ అండ్ మోడ్రన్ స్టైల్ సింబల్‌గా యూత్‌ను ఆకట్టుకుంటుంది.



