అరకు రైల్వే కాలనీలో భక్తి శ్రద్దలతో చండీ హోమం
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు రైల్వే స్టేషన్ రైల్వే కాలనీలో నిర్వహిస్తున్న దుర్గా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజు అమ్మవారు మహాచండీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వేదమంత్రాల నడుమ చండీ హోమం నిర్వహించారు. భక్తులు హోమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. పూజా కార్యక్రమాలతో రైల్వే కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.



