సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరి!

కొత్త ఫోన్ ధర ఎక్కువగా ఉండటంతో సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే తక్కువ ధర చూసి తొందరగా కొనేస్తే తర్వాత ఇబ్బందులు రావచ్చు. ముందుగా *#06# డయల్ చేసి IMEI నంబర్ చెక్ చేయాలి. CEIRలో ఫోన్ బ్లాక్‌లిస్ట్‌లో ఉందో లేదో చూడాలి. ఒరిజినల్ బిల్లు, వారెంటీతో పాటు స్క్రీన్, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్, స్పీకర్ అన్నీ చెక్ చేయాలి. సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్లు ఇంకా వస్తున్నాయో లేదో కూడా తెలుసుకోవాలి.


