← Back to news

స్టార్ట్ చేసిన రోజే స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం

By Sharmila· 1d ago· Deccanchronicle
స్టార్ట్ చేసిన రోజే  స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం

AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లోని SMS-1 విభాగంలో ఇవాళ ప్రమాదం జరిగింది. ప్రత్యేక పూజల తర్వాత అధికారులు సీడీసీని తిరిగి స్టార్ట్ చేసిన రోజే ల్యాడిల్ నుంచి ద్రవ ఉక్కు లీకైంది. అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదే విభాగంలో గతంలో జరిగిన ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.. దీంతో కార్మికులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More in AP