KPHBలో డ్రైనేజీ సమస్య.. అధికారులకు MLA ఆదేశాలు

మేడ్చల్ జిల్లాలోని కూకట్పల్లి నియోజకవర్గం KPHB డివిజన్ ఎల్ఐజీ 22–23 ప్రాంతంలో డ్రైనేజీ పొంగిపొర్లుతూ ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో MLA మాధవరం కృష్ణారావు సమస్యాత్మక ప్రాంతాన్ని పరిశీలించారు. మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి పరిస్థితిని సమీక్షించి, వెంటనే సమస్యను పరిష్కరించాలని Water Works అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని GHMC అధికారులకు సూచించారు.




