← Back to news

శిథిలావస్థలో పాఠశాల.. విద్యార్థుల భద్రతపై ఆందోళన

By Prasad Sode· 2h ago· Kalleru, Chinturu, Polavaram
శిథిలావస్థలో పాఠశాల.. విద్యార్థుల భద్రతపై ఆందోళన

పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు పంచాయతీ సూరన్నగొంది గ్రామంలోని గిరిజన ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనం గోడలకు ప్లాస్టరింగ్ ఊడిపోయి ఇటుకలు బయటకు కనిపిస్తున్నాయి. పైకప్పు, గోడలు పాతబడిపోవడంతో నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పాఠశాల ముందు ఏర్పాటు చేసిన కంచె కూడా తాత్కాలికంగా, అస్తవ్యస్తంగా ఉండటంతో పరిసరాలు అధ్వానంగా మారాయి.

శిథిలావస్థలో పాఠశాల.. విద్యార్థుల భద్రతపై ఆందోళన

More in Local