ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత
ఖమ్మంలో AISF, AIYF ఆధ్వర్యంలో చేపట్టిన జీఎస్టీ ఆఫీస్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారీ ర్యాలీగా వచ్చి ఆఫీస్లోకి వెళ్లేందుకు ట్రై చేయగా, పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. పలువురు లీడర్లను అరెస్ట్ చేసి టూ టౌన్ పిఎస్కు తరలించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించి అరెస్ట్ చేయాలని, SIR ప్రాసెస్ నిలిపేయాలని, ఓటు చోరీపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.



